Header Banner

ఏనుగుల బెడదను నియంత్రించేందుకు భారీ ప్రణాళిక! కూటమి సర్కారు మరో కీలక నిర్ణయం!

  Sun Feb 23, 2025 19:51        Politics

పార్వతీపురం మన్యం జిల్లాలో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల గుంపు సమస్యకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టేందుకు అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో ఏనుగులు సంచారంతో ఇప్పటివరకు పదిమంది వరకు మృత్యువాత పడగా, మరో 40 మంది వరకు గాయాలపాలయ్యారు. అంతేకాకుండా వేలాది ఎకరాల్లో పంట నష్టం, లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగి బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఏనుగుల గుంపు వేళాపాలా లేకుండా గ్రామాలపై దాడులకు తెగబడుతూ ఆస్తులు ధ్వంసం చేస్తున్నాయి. సాయంత్రం ఐదు దాటితే ఏనుగులు ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి తమ పై దాడులకు తెగబడతాయో తెలియక భయం భయంతో బ్రతుకుతున్నారు జిల్లావాసులు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏనుగుల సమస్య పై దృష్టి సారించింది. ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఏనుగుల తరలింపు కోసం అధికారులతో పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించారు.


ఇది కూడా చదవండి: అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి! 17 మంది భారతీయులను ఉరిశిక్ష! 


అంతేకాకుండా కుంకీ ఏనుగుల సహాయంతో ఏనుగులు తరలించాలని ప్రయత్నించారు. అయితే కుంకీ ఏనుగుల ప్రతిపాదనకు పలు రకాల సాంకేతిక సమస్యలు అడ్డురావడంతో ఆ ప్రతిపాదనను విరమించుకుంది రాష్ట్ర ప్రభుత్వం.. అనంతరం ఏనుగుల బెడద నుండి ఎలాగైనా జిల్లా వాసులను కాపాడాలనే ఉద్దేశ్యంతో ప్లాన్ బి అమలుకు సిద్ధమయ్యారు అధికారులు. అందులో భాగంగా ఏనుగుల గుంపు కోసం ప్రత్యేకంగా ఒక షెల్టర్ జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసం వడివడిగా అడుగులు వేస్తుంది. ఆ షెల్టర్ జోన్ లోనే ఏనుగులు ఉండేలా వాటికి కావలసిన ఆహారం, త్రాగునీటి వంటి సదుపాయాలు కూడా షెల్టర్ జోన్ లో ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. అందుకోసం సీతానగరం మండలం గుచ్చిమి సమీపంలో సుమారు 400 హెక్టార్ల భూమిని గుర్తించి, ఆ భూమిలో షెల్టర్ జోన్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


అలా ఏర్పాటుచేసే షెల్టర్ జోన్ కే ఏనుగులను పరిమితం చేసి జిల్లావాసుల ప్రాణ, పంట, ఆస్తి నష్టం జరగకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. అందుకోసం అటవీశాఖ ఉన్నతాధికారి శాంతిప్రియ పాండే కూడా షెల్టర్ జోన్ ప్రతిపాదిత ప్రదేశాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని అటవీ శాఖ అధికారులు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు కూడా తెలియజేశారు. దీంతో పవన్ కళ్యాణ్ కూడా షెల్టర్ జోన్ కి కావలసిన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని, అదే విధంగా ఆర్థికమైన అంశాలను కూడా పరిశీలించాలని సూచించారు. దీంతో అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. అధికారుల ప్రతిపాదనలు త్వరలో కార్యరూపం దాల్చనుంది. అదే జరిగితే ఏనుగులు సురక్షితంగా జిల్లావాసులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వతంగా జిల్లాలో ఉండే అవకాశం కనిపిస్తుంది.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #elephant #protection #todaynews #flashnews #latestupdate